ప్రవాసమా...ఇది వనవాసమా?
రామానంద్ వేటూరి----
వీధి దాటి,వాడ దాటి
ఊరు దాటి,యేరు దాటి
దేశం దాటి
సప్త సముద్రాలను దాటాం
శాపగ్రస్తుల్లా బ్రతుకీడుస్తున్నాం!
మాత్రు దేశాన్ని వదిలి
కన్నవాళ్ళను వదిలి
మిత్రులను వదిలి
కడలి దాటాం...కష్టాల కడలీదుతున్నాం!
జగమెరిగిన దేశం మనదని గర్విస్తాం
మరి,ఇంత తెలిసీ వలసెందుకు వస్తున్నాం
మనదేశం చేసిన పాపమా?
కాలచక్రపు కలికాలమా?
తల్లి భారతికి మూగ రోదనమా?
ప్రవాసమా...ఇది వనవాసమా?