Wednesday, November 22, 2006

మౌనం

రోహిణి--

శశి రాక కోసం
నిశి రాతిరి వేళ
కనులు కాయలు కాచిన
కలువ బాల విరహగీతం - మౌనం

నులివెచ్చని కిరణానికి
తొలి సంధ్య వేళ
మౄదు రేకు విచ్చిన
కమల కన్నె దరహాస గీతం - మౌనం

ఎల కోయిలను పిలవాలని
నవ వసంత వేళ
తొలి చిగురు తొడిగిన
లేత మావి కొమ్మ స్వాగత గీతం - మౌనం

సెలయేటి అలల పై
నిండు పున్నమి వేళ
తనివార తేలియాడే
చిరు తెమ్మెర తేట గీతం - మౌనం

కొండ కోనల తిరిగి
కర్షకుల కలలు పండించి
కడలి ఓడిలో సేద తీరే
నదీమతల్లి సంగమ గీతం - మౌనం

ప్రతి కదలికలో
ప్రతి కవళికలో
ప్రతిఫలించే సౌందర్యం
ప్రకృతి కాంత పరవశ గీతం - మౌనం

3 Comments:

At 9:31 AM, Blogger murthy said...

రాధిక గారు,

క్షంతవ్యుడ్ని. మీ కవితా సుధా తరంగాలలో చాల రోజుల్నుంచీ తేలియాడుతున్నా..

శశి రాక కోసం
నిశి రాతిరి వేళ - అని అన్నారు. "నిశి రాతిరి వేళ" చాల అర్థవంతంగా వున్నా, "నిశి రాత్రి వేళ" అని ఎందుకు లేదో, విన్నవించ మనవి.

అలాగే, మరొక్కటి..

నులివెచ్చని కిరణానికి
తొలి సంధ్య వేళ
మృదు రేకు విచ్చిన
కమల కన్నె దరహాస గీతం - మౌనం : అని అన్నారు..

చివరి రెండు పంక్తులు కొంచెం ఇలా విష్లేషించ మనవి.

"మృదు రేకు విచ్చిన కమల
కన్నె దరహాస గీతం - మౌనం"

 
At 10:21 AM, Blogger THINKERS CLUB said...

Dear Radhika

Just yesterday, after an essay in Andhrajyothi sunday magazine is published, I had seen ur blog for the first time. The kind of poetry u published in ur blog ( all urs or selected poems of others I am not clear)is refreshing and original,to the boot.I haven't seen in mainstream magazines for a long time.

It doesn't mean all the poems published are excellent grade.But I like one particular piece Mounam truly superb.

I want to express my spandana in chaste Telugu but I dont know how to write in this blog .If u can guide me welcome with thanks.

I truly feel inadequete to write in english about this poetic expression about silence.

any how kudos to u for this laudable effort.

Sidhhu

 
At 10:54 PM, Blogger SUBBAREDDY said...

radika garu mee blog eeroju chusanu. naaku chalaa baga nachindi. mukayanga mee kavitalu chala baga unnavi. neenu kuuda blog chestunnanu. mee sahayam aasistu. mee abimani
subbareddy

 

Post a Comment

<< Home