అర్దరాత్రి..
అభిసారిక--
పగలంతా ఏం చెసినా నీ అలోచనలు
రేయంత నువ్వులేని ఒంటరితనపు జాడలు
ఇదిగో వెల్లకిలా పొడుకుని
ఇలా వెన్నెల్లో ఆకాశంకేసి చూస్తుంటే
ఒక్కో తార ఒక్కో జ్ఞాపకంలా మారి మెరుస్తూంది
నన్ను మురిపిస్తూ నీకు దెగ్గరిగా ఉన్నంత ఓదార్పునిస్తునట్టుగా
అక్కడ నిన్ను.. ఇక్కడ నన్ను.. చూస్తున్న చంద్రుడు మాత్రం
మన ప్రేమ అంత నిర్మలంగా నవ్వుతున్నాడు
నువ్వు కుశలమే అని నాకు తెలుపుతునట్టుగా
నిన్ను తాకి వచ్చిన పిల్లగాలులు కాబోలు
నీ ఊపిరి పరిమళాన్ని మోసుకొని
అల్లరిగా ఆత్మీయంగా నన్ను స్పురిస్తున్నాయి
నా ముంగుర్లను సరిచేసి కుశలమడుగుతున్నాయి
మామిడి కొమ్మ మీద గువ్వల జంట నిద్రపోకుండా
ఎదో అర్దమైనట్టు చిలిపిగా నావంక చూస్తున్నాయి
నీకు తోడుగా మేము మేల్కునే ఉన్నాం సుమా అన్నటుగా
అర్దరాత్రి కొత్తగా చాలా వింత అనుభూతినిస్తూంది
ఇలా ప్రకృతిలో ఎం చూసినా ఎటు చూసినా
నీ తలపే నీ వలపే కనపడుతూంది
నీకై వేచి చూసే నా కనులకి అలసట రానీయనట్లుగా
ఇక సూర్యోదయానికి సిద్దమౌతున్న ఆకాశాన్ని చూస్తూంటే
మనం కలవబోయే కలలో ఓ రోజు తగ్గిందనో
రంగు రంగుల ఆకాశకిరణాలని తనలోకి ఆహ్వానిస్తూంది
మన అద్బుతమైన కలయికకి త్వరలోనే నాంది పలుకుతునట్లుగా ...
3 Comments:
hi radhika
how r u, u r kavitha great marvelous, excenllent, there is no word in the dictonery
bye
hai radhika,
nenu mee kavithalu ee roje chadivanu.baagunnayi.
Kurisae megam vanti ee jeevitam yeepudu evarini tana premato plukarimpa chestundo teliyadu kani , prathi okka mansuni uha lokam lo ontarini chesi kavi ga marchi kavitala toduntundhi ee prema. madura myena me kavita marala naa aa patha rojuluni nna kanula mundunchindi. good verry nice
Post a Comment
<< Home