ప్రవాసమా...ఇది వనవాసమా?
రామానంద్ వేటూరి----
వీధి దాటి,వాడ దాటి
ఊరు దాటి,యేరు దాటి
దేశం దాటి
సప్త సముద్రాలను దాటాం
శాపగ్రస్తుల్లా బ్రతుకీడుస్తున్నాం!
మాత్రు దేశాన్ని వదిలి
కన్నవాళ్ళను వదిలి
మిత్రులను వదిలి
కడలి దాటాం...కష్టాల కడలీదుతున్నాం!
జగమెరిగిన దేశం మనదని గర్విస్తాం
మరి,ఇంత తెలిసీ వలసెందుకు వస్తున్నాం
మనదేశం చేసిన పాపమా?
కాలచక్రపు కలికాలమా?
తల్లి భారతికి మూగ రోదనమా?
ప్రవాసమా...ఇది వనవాసమా?
5 Comments:
మీరు రాసింది నిజంగా నిజం...
మీరు అడిగారే ప్రవాసమా ? వనవాసమా ? అని...
నాకు కూడా గత మూడు నెలల నుంచి అదే అనుమానాం...
ఒక్క డబ్బులు సంపాదించుకోవచ్చు అని తప్ప, ఇంక వేరే ఏ రకంగానూ సంతృప్తి లేదు...
నచ్చిన వాళ్ళు లేరు, నచ్చిన తిండి లేదు... ఇంకెక్కడ నుంచి వస్తుంది ఆనందము రమ్మంటే... ???
ivi nenu raasinavi kaavandi.itarulu raasinavi.naaku nachi ikkada vunchanu.thanks for ur comment
జనాలు ఎందుకు ప్రవాస దేశాలకు వలస వెళుతున్నారు అంటే దానికి కారణం డబ్బు, వ్యామోహం కావచ్చు.
మనం ఎంత కాదనుకున్నా డబ్బు ఆకర్షణ అలాంటిది. అన్నిటిని జాయిస్తుంది.
చాలా బాగా రాసారు
janalu dabbu jabbu patti premanuragalanu marachi kullu kutantralu perigi shariraka korikala sudigundam lo chikki kanna thalini kanna thalli lanti deshanni vadili savathi thalli vodilo peragalanukune amayaka jananiki kanivippu eppudo kada jaihind
Post a Comment
<< Home