కాలం చేసిన మోసం
writer---రామానంద్ వేటూరి---
కాలం మారింది
అని కొమ్మచాటు కోయిల గొంతు విప్పింది
కాలం మారింది
మరి మనసు మారదేమి?
రాలి పడిన పువ్వులు చూస్తూ..
పండి రాలిన ఎండుటాకులు చూస్తూ..
యద లో రేగే సుడిగుండాలను తీరమెందుకు తాకనిచ్చింది?
అంధకారం లో వుంటూ అశ్రువుల అసువులెందుకు విడిచింది?
పాపం మనసు..
కొత్త రెమ్మల మీద కోయిలమ్మను చూసి
ఉత్త ప్రేమలు చేసిన గాయాన్ని తలచి
ఎక్కిపట్టి ఏడ్చింది..
మూగ భావాలను తొక్కి పట్టి వుంచింది!
కాలం మారిందని
కోయిల గానం ఆపిందా?
నెమలి నాట్యం ఆగిందా?
మరి మనసెందుకిలా బాధలో మునిగింది?
ఎందుకిలా ఒంటరిగా రోదిస్తోంది?
వసంతం కోసం ఎదురుచూసే కోయిలేగా మనసు
వర్షం కోసం చూసే చక్రవాకమేగా మనసు
అన్ని తెలిసి మనిషికెందుకు మనసంటే అంత అలుసు?
కాలం చేసిన మోసాన్నే తలుచుకుంటూ...
అయినా..
కాలానికేం తెలుసు మనిషి బాధ..?
మనిషికేం తెలుసు మనసు బాధ..?
0 Comments:
Post a Comment
<< Home