Wednesday, December 06, 2006

పల్లకి

writer--రామానంద్ వేటూరి

అంగరంగ వైభవంగా
అత్తవారింట అడుగుపెట్టు తరుణమది...

తనదయిన నవ జీవితంలోకి
ఆశగా అడుగుపెట్టు వధువుకు
జీవితపు వడి దుడుకులకు
తొలి మజిలీ నేనే అంటోందా పల్లకి!

పుట్టినింట పుత్తడిబొమ్మకి
మెట్టినింటికి దారి పరచి
కడ దాకా రాలేనన్న సంగతి మరచి
మురిపెంగా నేనున్నా అంటొంది ఆ పల్లకి!

కంటిపాపలా పెంచిన వారు
కంటి కొనలు దాటిపోతుంటే...
కనులెదట మనువాడినవాడుండగా
కంటికొలనులో కన్నీరెందుకే అంటోంది ఆ పల్లకి!

మది నిండా మమకారపు అలోచనలు సుడిగుండాలయి
యెద నిండా యేలుకునే వాడిపై యేకాగ్రత కుదరక
బరువెక్కిన హ్రుదయంతొ భారంగా కూర్చున్న వధువు
భారం కాసేపయినా మోయనివ్వమని ముందుకు కదిలిందా పల్లకి!!!

3 Comments:

At 7:31 PM, Anonymous Anonymous said...

జీవితపు వడి దుడుకులకు
తొలి మజిలీ నేనే అంటోందా పల్లకి!

ఒడిదుడుకులు అనేది మామూలుగా మనం చూసే పదం కదా.
జీవితపు వడి = జీవితంలోని వేగానికి, దుడుకులకు అనే అర్థంలో దాన్ని కావాలనే విరిచారా?

 
At 9:03 PM, Blogger రాధిక said...

miradigaka naaku doubt vastundi.kani a vidham ga chusina imcu michu ardam okeala vumtumdi kada....kavi garini kanukkunta lendi

 
At 6:27 AM, Blogger SATYA said...

ippudu ilanti alochanalu...yeah ammayiki unnayi....nijam ga....anduki ante andaru vere kapuralu pedutinnaru....kani mee blog chala bagundi....i really appreciate ur efforts

 

Post a Comment

<< Home